రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-26T06:15:51+05:30 IST

రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనడంతో సెక్యూరిటీగార్డు మృతి చెందాడు. నిర్మల్‌కు చెందిన అశోక్‌(40) ఫిలింనగర్‌లో నివాసముంటూ ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు.

రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొని వ్యక్తి మృతి

బంజారాహిల్స్‌, డిసెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొనడంతో సెక్యూరిటీగార్డు మృతి చెందాడు. నిర్మల్‌కు చెందిన అశోక్‌(40) ఫిలింనగర్‌లో నివాసముంటూ ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం విధుల్లో ఉన్న అతడు భోజనం చేసేందుకు జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబరు 82 వద్ద రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్‌ వాహనంతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. అశోక్‌ తల్లి నిర్మల్‌లో ఉంటుందని తెలియడంతో పోలీసులు వారికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 



Updated Date - 2020-12-26T06:15:51+05:30 IST