ఎస్‌ఆర్‌నగర్‌ పోస్టాఫీసులో ఉచిత ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ శిబిరం రేపు

ABN , First Publish Date - 2020-12-15T06:38:39+05:30 IST

ఎస్‌ఆర్‌నగర్‌ పోస్టాఫీసులో ఈనెల 16వ తేదీన ఉచిత ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ శిబిరం నిర్వహిస్తున్నామని పోస్టుమాస్టర్‌ స్వర్ణలత ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్‌ఆర్‌నగర్‌ పోస్టాఫీసులో  ఉచిత ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ శిబిరం రేపు

అమీర్‌పేట, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌నగర్‌ పోస్టాఫీసులో ఈనెల 16వ తేదీన ఉచిత ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ శిబిరం నిర్వహిస్తున్నామని పోస్టుమాస్టర్‌ స్వర్ణలత ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్‌ ఉచిత ఎన్‌రోల్‌మెంట్‌తోపాటు ఇప్పటికే ఆధార్‌ కార్డు తీసుకున్నవారు తమ కార్డులో వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రూ. 50 చెల్లించి వివరాలు సరిచేసుకోవచ్చన్నారు. శిబిరం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలు సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), ఇతర రికరింగ్‌ డిపాజిట్లకు సంబంధించిన ఖాతాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. 


Updated Date - 2020-12-15T06:38:39+05:30 IST