మహనీయుడు అంబేడ్కర్‌

ABN , First Publish Date - 2020-04-15T07:09:27+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మహనీయుడని పలువురు పేర్కొన్నారు.

మహనీయుడు అంబేడ్కర్‌

నగరంలో పలుచోట్ల విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళి


(ఆంధ్రజ్యోతి, సిటీన్యూస్‌ నెట్‌వర్క్‌) : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మహనీయుడని పలువురు పేర్కొన్నారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మంగళవారం ఆయన జయంతి సందర్భంగా నగరంలో పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో అంబర్‌పేట, ముషీరాబాద్‌, ఎల్‌బీనగర్‌, రాజేంద్రనగర్‌, ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, చెన్నూరు, ఉప్పల్‌ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, టి.ప్రకా్‌షగౌడ్‌, దానం నాగేందర్‌, ఆరెకపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మైనంపల్లి హన్మంతరావు, బాల్క సుమన్‌, భేతి సుభా్‌షరెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్‌, బండి సంజయ్‌, చిలుకానగర్‌లో మేడ్చల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్‌, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌, దక్షిణ భారత పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌, దక్షిణభారత అడ్వకేట్స్‌ జేఏసీ కన్వీనర్‌ ఎస్‌.నాగేందర్‌, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు బి.దీపక్‌కుమార్‌, టీపీసీసీ ఓబీసీ సెల్‌ వైస్‌ చైర్మన్‌ కట్టెల సుభాష్‌ నివాళులర్పించారు. రాజేంద్రనగర్‌లో పి.కార్తీక్‌రెడ్డి, దుండిగల్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ బాలమల్లు అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 


టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, ఎం.రాజేందర్‌, జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌ హుసేనీ, ఉస్మానియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మెహబూబ్‌ఖాన్‌ నివాళులర్పించారు.  

 

టీజేఎస్‌ నగర ప్రధాన కార్యదర్శి రాంచందర్‌, బీఎస్పీ నగర అధ్యక్షుడు శ్రీరామదాసుల సంజీవచారి, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ తెలంగాణ(మార్కి్‌స్ట-అంబేడ్కరిస్ట్‌) రాష్ట్ర అధ్యక్షుడు పులిజాల గెల్వయ్య, జై భీంసేన రాష్ట్ర అధ్యక్షుడు టి.ధన్‌రాజ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, ఎమ్మార్పీఎస్‌ జాతీయ కార్యదర్శి బట్టు దాస్‌రావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు చెన్నారెడ్డి, కూకట్‌పల్లిలో బీజేపీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు, ఎమ్మెన్‌ శ్రీనివా్‌సరావు, టీడీపీ నగర కార్యాలయంలో పార్టీ నగర కన్వీనర్‌ పి.సాయిబాబా, పి.బాల్‌రాజ్‌గౌడ్‌, విద్యానగర్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, నీల వెంకటేష్‌, అడిక్‌మెట్‌లో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌, మల్కాజిగిరి సర్కిల్‌ వినాయకనగర్‌లో మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేకొండ నరేశ్‌బాబు, జేజేనగర్‌లో మాలమహానాడు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రశేఖర్‌, సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా. చీఫ్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ కిషోర్‌, పికెట్‌ చౌరస్తాలో బోయినపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టి.ఎన్‌.శ్రీనివాస్‌ నివాళులర్పించారు.  

Updated Date - 2020-04-15T07:09:27+05:30 IST