దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-07-05T09:59:34+05:30 IST

తెలంగాణ ప్రజా పోరాటాల చరిత్రలో దొడ్డి కొమురయ్య అమరత్వం చాలా విశిష్టమైనదని టీఎన్‌జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌

దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

హైదరాబాద్‌ సిటీ, జూలై 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజా పోరాటాల చరిత్రలో దొడ్డి కొమురయ్య అమరత్వం చాలా విశిష్టమైనదని టీఎన్‌జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి అన్నారు. శనివారం కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకొని టీఎన్‌జీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కారం రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ నిజాం రాచరికపాలన అంతమవడానికి, హైదరాబాద్‌ రాజ్యం భారత్‌లో విలీనం కావడానికి దొడ్డి కొమురయ్య అమరుడవడం కారణమైందన్నారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి, రైతాంగ పోరాటానికి ఇది చోదక శక్తిగా పనిచేసిందన్నారు. టీజీవో నేత డాక్టర్‌ వెంకట్‌ గండూరి మాట్లాడుతూ అమరవీరుల స్వప్నాలు సాకారమవుతున్నాయని, రాష్ట్రం వ్యవసాయ, ఆర్థిక రంగాల్లో దూసుకుపోతోందన్నారు. ఈ కార్యక్రమంలో  ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె శ్రీనివాస్‌, టీఎన్‌జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్‌, అధ్యాపక సంఘం నేతలు అప్పాల శ్రీనివాస్‌, ఏరుకొండ నర్సింహుడు, లక్ష్మయ్యగౌడ్‌, శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-05T09:59:34+05:30 IST