ఆరు పదులు దాటినా..

ABN , First Publish Date - 2020-11-28T07:13:47+05:30 IST

బల్దియా పోరులో ఆరు పదులు వయసు దాటిన వారు సుమారు 30 మంది గ్రేటర్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థు లుగా పోటీ చేస్తున్నారు.

ఆరు పదులు దాటినా..

పోటీలో 30 మంది.. 

గత ఎన్నికల కంటే తక్కువే.. 

పోటీలో 75 ఏళ్ల సూర్యనారాయణ

జూబ్లీహిల్స్‌ నుంచి బరిలో..

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): బల్దియా పోరులో ఆరు పదులు వయసు దాటిన వారు సుమారు 30 మంది గ్రేటర్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌ అభ్యర్థు లుగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలో పోలిస్తే సుమారు 20 మంది ఆరు పదుల వయస్సు వారు ఎన్నికల బరిలో నిలిచారు. కొవిడ్‌- 19 నేపథ్యంలో 60 ఏళ్ల పైబడిన వారు వయోధికులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ వివరాల ప్రకారం.. 60 ఏళ్లు పైబడి టీఆర్‌ఎస్‌ నుంచి ఆరుగురు, టీడీపీ నుంచి ఆరుగురు, బీజేపీ.. కాంగ్రెస్‌ల నుంచి ముగు ్గరు ఉన్నారు. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు ఎనిమిది మంది ఉన్నారు. కాగా, జూబ్లీహిల్స్‌ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న కె. సూర్యనారాయణ అభ్యర్థుల్లో కెల్లా పెద్ద వయస్సు వారు. ఆయన 75 ఏళ్ల వయస్సులో పోటీ చేస్తున్నారు. ఇదే పార్టీ నుంచి 70 ఏళ్ల కె. విఠల్‌రెడ్డి మన్సూరాబాద్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 30 మందిలో మిగిలిన వారి వయస్సు 60 నుంచి 70 మధ్యలో ఉంది.

Updated Date - 2020-11-28T07:13:47+05:30 IST