గ్రేటర్‌లో అందుబాటులో 5 కిలోల ఇండియన్ గ్యాస్ సిలిండర్
ABN , First Publish Date - 2020-12-16T04:51:28+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్‌లో మొట్టమొదటసారిగా బహుళ ప్రజానీకానికి, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా అతితక్కువ ధరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ‘చ్చోటు’ ఐదుకిలోల సిలిండర్‌ను మార్కెట్‌లోకి

బౌద్ధనగర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌లో మొట్టమొదటసారిగా బహుళ ప్రజానీకానికి, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా అతితక్కువ ధరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ‘చ్చోటు’ ఐదుకిలోల సిలిండర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మంగళవారం సికింద్రాబాద్ వారాసిగూడలోని పద్మా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిడెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆఫీ్‌స(టీఏపీఎ్‌సఓ) జనరల్ మేనేజర్ (ఎల్పీజీ) బి.ఆనంద్‌రెడ్డి, డీజీఎం త్రిదేవ్‌దత్త, కన్జ్యూమర్ సీనియర్ మేనేజర్ వీవీ గణేశ్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొని ’చ్చోటు’ ఐదుకిలోల గ్యాస్ సిలిండర్‌ను వినియోగదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్యాస్ సిలిండర్ తీసుకోవటానికి ఎటువంటి పత్రాలూ అవసరములేదని నేరుగా మీ దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీలో పొందవచ్చునని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మాగ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు ధారా గంగాధరగుప్తా తదితరులు పాల్గొన్నారు.