మహా నగరంలో మియావాకి గార్డెన్‌లు
ABN , First Publish Date - 2020-06-16T09:47:55+05:30 IST
మహానగరానికి పచ్చలహారం అద్దేందుకు జీహెచ్‌ఎంసీ మరోసారి కసరత్తు ప్రారంభించింది. ప్రధాన, అంతర్గత రహదారులు, ఖాళీ

హరితహారంలో భాగంగా 50 లక్షల ప్లాంటేషన్
మూసీకి ఇరువైపులా కూడా...
ప్రధాన, అంతర్గత రహదారులు.. వంతెనల కింద మొక్కలు
హైదరాబాద్ సిటీ, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): మహానగరానికి పచ్చలహారం అద్దేందుకు జీహెచ్‌ఎంసీ మరోసారి కసరత్తు ప్రారంభించింది. ప్రధాన, అంతర్గత రహదారులు, ఖాళీ స్థలాల్లోనే కాకుండా మురుగు పారే మూసీకి రెండు వైపులా.. స్వచ్ఛమైన ప్రాణవాయువునిచ్చే మొక్కలు నాటనున్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా 2020-21 సంవత్సరానికి గ్రేటర్‌లో 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో అర్బన్ ఫారె్‌స్టలను అభివృద్ధి చేయనున్నారు. ఖాళీ స్థలాల్లో జపాన్, మియావాకి రకాల గార్డెన్‌లు అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. చెరువులు, నాలాల ఒడ్డున, మూసీకి ఇరువైపులా మొక్కలు నాటుతామని కమిషనర్ డీఎస్ లోకే్‌షకుమార్ తెలిపారు. సూరారం, మాదన్నగూడ, నాదర్‌గుల్ అర్బన్ ఫారె్‌స్టలలో మొక్కలు ఎక్కువగా ఉండేలా ప్రణాళికలతో పార్కులు అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.
వంతెనల కింద వనాలు...
హరితహారంలో భాగంగా గతంలో నగరంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు, విద్యా సంస్థలు, కార్పొరేట్ కార్యాలయ ప్రాంగణాల్లో మొక్కలు నాటారు. ప్రస్తుతం మొక్కలు నాటేందుకు అనువైన స్థలం లేకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. వంతెనల కింద, రోడ్ల పక్కన మొక్కల పెంపకానికి ఈ సారి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తక్కువ ఎత్తు, ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే రకాల మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీకి సంబంధించి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు వాకింగ్ ట్రాక్‌లు అభివృద్ధి చేయనున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో పచ్చదనం చాలా తక్కువగా ఉంది.