ఎన్నికల నిర్వహణకు 45వేల మంది ఉద్యోగులు

ABN , First Publish Date - 2020-11-19T09:59:36+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణలో దాదాపు 45 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాలు, మరో 11 జిల్లాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ఈ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం చేయనున్నారు. ఈ 45 వేల మంది సిబ్బందిలో 20 వేల మంది

ఎన్నికల నిర్వహణకు 45వేల మంది ఉద్యోగులు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌18 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణలో దాదాపు 45 వేల మంది అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాలు, మరో 11 జిల్లాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ఈ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం చేయనున్నారు. ఈ 45 వేల మంది సిబ్బందిలో 20 వేల మంది పీఓ, ఏపీఓలకు సంబంధిత జిల్లాలలో ఎన్నికల శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 431 రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక శిక్షణను పూర్తిచేశారు. బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణను ట్రైనింగ్‌ నోడల్‌ అధికారి జె.శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.


నగరంలో 3500 పోస్టర్లు, బ్యానర్ల తొలగింపు

ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో బుధవారం 3500 పోస్టర్లు, బ్యానర్లు తొలగించినట్టు జీహెచ్‌ఎంసీ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు నోడల్‌ అధికారి విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన రెండు రోజుల్లో 7500ల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించామని తెలిపారు.  తక్షణమే నగరంలో వివిధ పార్టీలు, నాయకులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు 20 ప్రత్యేక బృందా లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయా లు, భవనాలు, ప్రహరీలు, ప్రధాన రహదారుల వెంట ఉన్న ప్లెక్సీలు, బ్యానర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. నగరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమ లు చేయడానికి సర్కిళ్లవారిగా నిఘా బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని విశ్వజిత్‌ కంపాటి వివరించారు. 

Updated Date - 2020-11-19T09:59:36+05:30 IST