ఐసోలేషన్‌ కేంద్రాలకు నలుగురు

ABN , First Publish Date - 2020-03-25T09:53:21+05:30 IST

విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉండని పలువురిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు జీహెచ్‌ఎంసీ అధికారులు. మూసాపేటకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 13న దుబాయి...

ఐసోలేషన్‌ కేంద్రాలకు నలుగురు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి):  విదేశాల నుంచి వచ్చి హోం క్వారంటైన్‌లో ఉండని పలువురిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు జీహెచ్‌ఎంసీ అధికారులు. మూసాపేటకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 13న దుబాయి నుంచి వచ్చాడు. కూకట్‌పల్లి అవంతినగర్‌ నివాసి ఈ నెల 10న అమెరికా నుంచి నగరానికి వచ్చారు. కూకట్‌పల్లి గాయత్రినగర్‌కు చెందిన ఈ నెల 15న హైదరాబాద్‌కు చేరుకున్నారు. యూసు్‌ఫగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒకరు ఈ నెల 21న సౌదీ అరేబియా నుంచి వచ్చారు. వీరు హోం క్వారంటైన్‌లో ఉండడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలించారు.  

Read more