6 నెలల్లో 27 లక్షల కేసులు

ABN , First Publish Date - 2020-07-15T10:17:36+05:30 IST

ఈ ఏడాది జూన్‌ వరకు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 27 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గతేడాదితో

6 నెలల్లో 27 లక్షల కేసులు

తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలు

పెరిగిన ఉల్లంఘనుల కేసులు..  


హైదరాబాద్‌ సిటీ, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్‌ వరకు ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 27 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే... ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రోడ్డు ప్రమాద మృతుల్లో 23 శాతం  తగ్గినట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ వెల్లడించారు.  రోడ్డు ప్రమాదాల్లో 106 మంది మరణించగా.. వారిలో 90 మంది మృతికి అతివేగమే కారణమని వివరించారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల 8మంది(మార్చి 22 ముందు) మృతి చెందారు.


గతేడాది తొలి అర్ధవార్షిక గణాంకాలు పరిశీలిస్తే... 31 మరణాలు తగ్గగా వారిలో 20మంది పాదచారులున్నారు. 2018లో జూన్‌ నెల వరకు 150మంది ప్రమాదాల్లో మరణించగా వారిలో 63మంది పాదచారులున్నారు. 2019లో జూన్‌ వరకు 137మంది మృతిచెందగా 53మంది పాదచారులున్నారు. 2020లో జూన్‌ వరకు 106 మరణాలు సంభవించగా వారిలో 33మంది పాదచారులున్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన వారిలో 23శాతం తగ్గగా... పాదచారుల్లో 38శాతం తగ్గాయి.


నెలల వారీగా పరిశీలిస్తే... జనవరిలో గతేడాది 27, ఈ ఏడాది 24, ఫిబ్రవరిలో 28- 24, మార్చిలో 19-16, ఏప్రిల్‌లో 21-6, మేలో 27-23, జూన్‌లో 15-13 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి. ఈ ఏడాది 106 మరణాల్లో 90మంది అతివేగం కారణంగా, 8మంది మద్యం తాగి వాహనం నడపడంతో, ఇద్దరు రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ కారణంగా, ఇద్దరు నిర్లక్ష్యం కారణంగా, నలుగురు అకస్మాత్తుగా వాహనానికి కుక్కలు అడ్డంగా రావడంతో జారి పడి మృత్యువాత పడ్డారు. కాగా ఈ నెల 12వరకు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందడం కొసమెరుపు. 


60బ్లాక్‌స్పాట్‌లు

 నగరంలో ప్రమాదాలకు ఆస్కారమున్న 60బ్లాక్‌ స్పాట్‌లలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఆర్‌డీసీఎస్‌, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ తదితర శాఖాధికారులతో సంయుక్త తనిఖీలు, సమావేశాలు నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు సీపీ చెప్పారు.  ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని... ఉల్లంఘించిన వాహనదారులను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కల్పించామన్నారు.


 గణాంకాలు... 

ఉల్లంఘన         2019 2020

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని వారు 7,612 10,514

ట్రిపుల్‌ రైడింగ్‌          43,759 44,098

రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ 1,05,346 87,691

నెంబర్‌ప్లేట్‌ అవకతవకలు 63,235 69,536

రాంగ్‌ పార్కింగ్‌         1,23,460 1,53,207

సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ 10,684 12,019

మైనర్‌ డ్రైవింగ్‌         2,732 1,049

ప్రమాదకర డ్రైవింగ్‌ 25,852 89,781

సిగ్నల్‌ జంపింగ్‌ 19,540 16,373

హెల్మెట్‌ లేకుండా 18,12,198 22,26,625

మొత్తం         22,14,418 27,10,893 

Updated Date - 2020-07-15T10:17:36+05:30 IST