పలు కేసుల్లో పట్టుబడిన 175 వాహనాల వేలం

ABN , First Publish Date - 2020-12-15T05:56:26+05:30 IST

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు కేసుల్లో పోలీసుల స్వాధీనంలో ఉన్న 175 వాహనాలను వేలం వేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో

పలు కేసుల్లో పట్టుబడిన 175 వాహనాల వేలం

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలు కేసుల్లో పోలీసుల స్వాధీనంలో ఉన్న 175 వాహనాలను వేలం వేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వాహన యజమానులు ఈ ప్రకటన వెలువడిన ఆరు నెలలలోపు పత్రాలతో కమిషనరేట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ప్రకటన వెలువడిన ఆరు నెలలోపు వాహనాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. వాహనాల వివరాల కోసం సిటీ ట్రైనింగ్‌ సెంటర్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.నరసింహను సంప్రదించాలని లేదా హైదరాబాద్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌ చూడవచ్చన్నారు.

Updated Date - 2020-12-15T05:56:26+05:30 IST