శ్రీభవానీ శంకర ఆలయానికి కిలోన్నర వెండి నాగసర్ప కిరీటం బహూకరణ
ABN , First Publish Date - 2020-12-16T04:53:47+05:30 IST
భోలక్‌పూర్‌లోని దేవునితోటలో గల 400 సంవత్సరాల చరిత్ర గల శ్రీభవానీ శంకర ఆలయంలోని శివలింగానికి స్వామి వారి భక్తుడు గూడూరు మల్లారెడ్డి వెండి కిరీటాన్ని బహూకరించారు.

ముషీరాబాద్: భోలక్‌పూర్‌లోని దేవునితోటలో గల 400 సంవత్సరాల చరిత్ర గల శ్రీభవానీ శంకర ఆలయంలోని శివలింగానికి స్వామి వారి భక్తుడు గూడూరు మల్లారెడ్డి వెండి కిరీటాన్ని బహూకరించారు. మంగళవారం వేదపండితుల మంత్రోచ్చరణల నడుమ కిలోన్నర వెండితో ప్రత్యేకంగా తయారు చేసిన నాగసర్ప కిరీటాన్ని శివలింగానికి అలంకరించారు. దేవాలయ కమిటీ చైర్మన్ ఆర్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కీరిటాన్ని అందజేసిన మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు. భక్తుడు మల్లారెడ్డి మాట్లాడుతూ ఆలయంపై అపారమైన నమ్మకం, కోరుకున్న కోరికలు నెరవేరడంతో వెండి కీరిటాన్ని సమర్పించానన్నారు. దేవాదాయ శాఖ ఈవో జ్యోతి, ఆలయ కమిటీ చైర్మన్ ఆర్.శ్రీనివా్‌సలు మాట్లాడుతూ దేవాలయాన్ని భక్తుల సహకారంతో అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు విజయకుమార్, కమిటీ ధర్మకర్తలు విజయలక్ష్మి, అరవింద్‌కుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.