స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా 15 నామినేషన్లు దాఖలు

ABN , First Publish Date - 2020-06-19T08:05:50+05:30 IST

గ్రేటర్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక మరోసారి ఏకగ్రీవం కానుంది. 15 మంది సభ్యులకుగాను 15

స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా 15 నామినేషన్లు దాఖలు

ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే ఫ ఈ కమిటీ కాలపరిమితి ఎనిమిది నెలలే


హైదరాబాద్‌సిటీ/సికింద్రాబాద్‌/చిక్కడపల్లి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి):  గ్రేటర్‌ స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక మరోసారి ఏకగ్రీవం కానుంది. 15 మంది సభ్యులకుగాను 15 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌ నుంచి తొమ్మిది మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు బరిలో నిలిచారు. గురువారం నామినేషన్ల గడువు ముగిసింది. పరిశీలన, ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అధికారికంగా ఎన్నికను ప్రకటించనున్నారు. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ -99, ఎంఐఎం- 44, బీజేపీ -4, కాంగ్రెస్‌-2, టీడీపీ ఒక స్థానాల్లో గెలిచాయి. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి విజయం సాధించిన ఒక్కో కార్పొరేటర్‌ టీఆర్‌ఎ్‌సలో చేరడంతో ఆపార్టీలకు మొదటి నుంచి కమిటీలో స్థానం దక్కడం లేదు. గత నాలుగు పర్యాయాలు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇప్పుడు ఎన్నికవనున్న పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2021తో ముగియనుంది. 


టీఆర్‌ఎస్‌ సభ్యుల పేర్లు..

అత్తెల్లి అరుణ సామ స్వప్న గంధం జ్యోత్స్న సింధు ఆదర్శ్‌రెడ్డి ముద్రబోయిన శ్రీనివాసరావు ముఠా పద్మ  సబిత కిషోర్‌ లక్ష్మీ బాల్‌రెడ్డి  ధనుంజయ గౌడ్‌ 


ఎంఐఎం సభ్యుల పేర్లు..

మీర్‌బస్తీ అలీ, ఫసలీమ్‌బేగ్‌, మజీద్‌ హుస్సేన్‌, రాజ్‌మోహన్‌, నసీరుద్దీన్‌

Updated Date - 2020-06-19T08:05:50+05:30 IST