క్రిమిసంహారక మందు తాగి ఒకరు ఆత్మహత్యకు

ABN , First Publish Date - 2020-12-11T05:49:56+05:30 IST

తోషం తండా గ్రామంలో బుధవారం సాయంత్రం రా థోడ్‌ ప్రకాష్‌ (37) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై రోహిణి తెలిపారు.

క్రిమిసంహారక మందు తాగి ఒకరు ఆత్మహత్యకు

గుడిహత్నూర్‌ : తోషం తండా గ్రామంలో బుధవారం సాయంత్రం రా థోడ్‌ ప్రకాష్‌ (37) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై రోహిణి తెలిపారు. గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. బోథ్‌ మం డలం పార్టీ గ్రామానికి చెందిన ప్రకాష్‌ నాలుగేళ్ల క్రితం తోషం తండాకు వచ్చి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాడు. వ్యవసాయం పెట్టుబడి కోసం సోనాల బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మరికొంత ప్రైవేట్‌గా అప్పు చేసిన ట్లు తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. బు ధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడగా, గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-12-11T05:49:56+05:30 IST