రైతువేదిక భవనాలు త్వరగా పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-06T04:40:29+05:30 IST
రైతు వేదికల భవనాల పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు.

- అదనపు కలెక్టర్ రాంబాబు
దహెగాం, డిసెంబరు 5: రైతు వేదికల భవనాల పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదిక భవనాల పనులను పరిశీలించారు. విద్యుత్ కనెక్షన్‌తో పాటు భవనంలో మౌలిక వసతులను తక్షణమే పూర్తి చేయా లని సూచించారు. అనంతరం పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. మొక్కలను సంరక్షించడంతో పాటు ప్రకృతి వనంలో నేలను చదును చేయాలని సూచించారు. మండలంలోని దహెగాం, హత్తిని, లగ్గాం గ్రామా ల్లో బీఎల్ఓ కేంద్రాలను ఆయన పరిశీలించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి నీ ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. చనిపోయిన, పెళ్లి అయిన, వలస వెళ్లిన వారిని గుర్తించి జాబితా నుంచి తొలగించాల న్నారు. దహె గాం, లగ్గాం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలం లేదని, విక్రయించిన డబ్బులు సమయానికి రావడం లేదని పలువురు రైతులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో సత్యనారాయణగౌడ్, డీఎస్వో స్వామి, ఆర్ఐ మోహన్, సర్పంచ్ లక్ష్మి, పీఏసీఎస్ సీఈవో బక్కయ్య, ఏఈ ఆత్మారాం, ఏఈవో వెన్నెల, శోభ న్, సిబ్బంది నారాయణ, జీవన్ తదితరులు ఉన్నారు.