కలిసి పని చేస్తేనే ప్రగతి

ABN , First Publish Date - 2020-03-02T12:36:58+05:30 IST

ప్రజలు, ప్రజా ప్రతి నిధులు, అధికారులు అందరూ కలిసి పనిచేస్తేనే పట్ట ణ ప్రగతి సాధించవచ్చని కలెక్టర్‌ శ్రీదేవసేన

కలిసి పని చేస్తేనే ప్రగతి

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ శ్రీదేవసేన

బహిరంగ మలవిసర్జన చేస్తే జరిమానా

మున్సిపల్‌ కార్మికులకు సత్కారం


ఆదిలాబాద్‌టౌన్‌, మార్చి 1: ప్రజలు, ప్రజా ప్రతి నిధులు, అధికారులు అందరూ కలిసి పనిచేస్తేనే పట్ట ణ ప్రగతి సాధించవచ్చని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. ఆదివారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 23 వార్డులో కలెక్టర్‌ పర్యటించి పరిసరాలను పరిశీలించా రు. ఇంటింటికి వెళ్లి చెత్త బుట్టలపై ఆరా తీశారు. వెను కబడిన ఆదివాసీ గ్రామం ఐక్యతతో పరిశుభ్రంగా ఉం చుకుంటున్నారని, ఆలోచన, ఆచరణలో పట్టణ వాసు లు మాత్రం వెనుకబడి ఉన్నారన్నారు. సమష్టి కృషి తోనే పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని, పట్టణ వా సుల సహకారం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మా ట్లాడారు. పట్టణ జనాభా 1.25లక్షలు కాగా రోజుకు 66 మెట్రిక్‌ టన్నుల చెత్తను మనం తయారు చేస్తున్నా మని తెలిపారు. 300ల మంది కార్మికులు ఆ చెత్తను తీస్తున్నారని తెలిపారు. కాని కార్మికులను ఎవరు గౌర వించడం లేదని, వారు చేసే పని మనం చేయక పోగా మనవల్ల జరిగిన, మనం చేసే రోజూ వారి కార్యక్రమా ల వల్ల మురికి నీరు నాలాలో నిండి రోడ్ల పై పారు తుంటే కార్మికులను తప్పు బట్టడం ఎంత వరకు స మంజసమని ప్రశ్నించారు. ప్రతీఒక్కరు ఆయా వా ర్డుల్లో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా డబ్బాల్లో వేయా లని సూచించారు. మురికి కాల్వల్లో వేయకూడదని ప్ర తీ ఒక్కరు మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. బ హిరంగ మల విసర్జన చేయ కూడదని అలా చేసే వా రి నుంచి జరిమానా వసూలు చేస్తామని హెచ్చరిం చారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలి పారు. మనం తయారు చేసిన చెత్తకు మనమే బాధ్యు లమని మున్సిపల్‌ వర్కర్లు చేసే పనికి వెల కట్టలేమని ఇలాంటి పనులు లక్షల వేతనం ఇచ్చిన ఎవరు ముం దుకురారన్నారు. అలాంటి వారిని మనం గౌరవించా లని పేర్కొన్నారు. అంతకు ముందు కలెక్టర్‌ మున్సిపల్‌ కమిష నర్‌, వార్డు కౌన్సిలర్‌లతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. మున్సిపల్‌ వర్కర్లు నాలా శ్రీనివాస్‌, రోడ్డ రాధ, కుంట్ల గంగాదేవిలను కలెక్టర్‌ శాలువాలతో సన్మానించారు.


ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ పం దిరి భూమన్న, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రా జు, స్పెషల్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు, స్థానికులున్నారు.  ఇదిలా ఉంటే పట్టణ ప్రగతి కార్య క్రమంలో భాగంగా ఆయా వార్డులైన 44, 23, 18, 12, 48 తదితర వార్డులతో పాటు మిగిలిన అన్ని వార్డుల్లో మురికి కాల్వల పరిశుభ్రత, పరిసరాల్లో నిలిచి ఉన్న చెత్తను తొలగించగా ఆయా మరికొన్ని వార్డుల్లో మిషన్‌ భగీరథ పైపు లీకేజిలకు మరమ్మతులు చేశారు.

Updated Date - 2020-03-02T12:36:58+05:30 IST