పెద్ద వాగులో పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2020-03-18T06:10:15+05:30 IST

మండలంలోని వంకులం గ్రామానికి చెం దిన బీ లచ్చుంబాయి (65) మంగళవా రం ప్రమాదవశాత్తు పెద్ద వాగులో మునిగి మృతి

పెద్ద వాగులో పడి మహిళ మృతి

రెబ్బెన, మార్చి 17: మండలంలోని వంకులం గ్రామానికి చెం దిన బీ లచ్చుంబాయి (65) మంగళవా రం ప్రమాదవశాత్తు పెద్ద వాగులో మునిగి మృతి చెందినట్లు రెబ్బెన ఎస్‌ఐ దీకొండ రమేష్‌ తెలిపారు. ఆయన తెలిపిన ప్రకారం లచ్చుంబాయి ఉదయం కుటుంబ సుభ్యుల బట్టలు ఉతకడానికి గాను సమీ పంలోని పెద్ద వాగుకు వెళ్లింది. మధ్యాహ్నం పూట అటుగా వెళ్లిన ఆనందరావు, గంగయ్యలు వాగులో మహిళ శవాన్ని గుర్తించి సమాచారం అం దించగా గ్రామస్థులు అక్కడకు వెళ్లి లచ్చుంబాయిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-18T06:10:15+05:30 IST