వైన్స్ షాప్‌లో చోరీకి యత్నం
ABN , First Publish Date - 2020-12-19T05:42:31+05:30 IST
మండలంలోని సోనాలలో గల వైన్స్‌షాప్‌లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు.

బోథ్ రూరల్, డిసెంబర్ 18: మండలంలోని సోనాలలో గల వైన్స్‌షాప్‌లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. స్థానికులు తెల్లవారుజామున విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రాజు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చోరీకి యత్నించిన వ్యక్తులను తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలను పరిశీలించగా నలుగురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏ వస్తువు కూడా చోరీకి గురికాలేదని, నిందితులను త్వరలోనే గుర్తిస్తామని ఆయన తెలిపారు.