ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాం

ABN , First Publish Date - 2020-12-20T06:55:55+05:30 IST

చట్ట వ్యతిరేకంగా వ్యవహరి స్తే ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న

కాల్పుల కలకలంపై స్పందించిన ఎమ్మెల్యే రామన్న

ఆదిలాబాద్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): చట్ట వ్యతిరేకంగా వ్యవహరి స్తే ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో జరిగిన సంఘటనపై స్పందించారు. ఏ రాజకీయ పార్టీ నేతలైనా చట్ట వ్యతిరేకం గా వ్యవహరిస్తే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు.కేసీఆర్‌ ప్రభుత్వ హాయాంలో ఎలాంటి హింసకు తావివ్వకుండా పాలన జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఇలాంటి సంఘటనలను వ్యతిరేకించాలన్నారు. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. అమానుషంగా గన్‌, కత్తులతో దాడి చేయడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నా రు. బాధితులకు ధైర్యానిచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాధితుల పక్షాన నిలబడి ఆదుకునే బాధ్యత నాపై ఉందన్నారు. మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఫారుఖ్‌అహ్మద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం జరిగిందన్నారు. ఇందులో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రహ్లాద్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జహీర్‌రంజాని, షిరాజ్‌ఖాద్రి ఉన్నారు.

Updated Date - 2020-12-20T06:55:55+05:30 IST