అక్రమ వెంచర్‌లపై కొరడా

ABN , First Publish Date - 2020-12-26T05:20:54+05:30 IST

బోథ్‌ మండల కేంద్రంలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘‘డోంట్‌వర్రీ..అమ్మేసుకోండి’’ అనే వార్త కథనం ప్రచురితం కావడంతో స్పందించిన బోథ్‌ గ్రామ పంచాయతీ అధికారులు మండల కేంద్రానికి సమీపంలో సాయినగర్‌ కాలనీకి ఆనుకొని ఉన్న వెంచర్‌ను తొలగించారు.

అక్రమ వెంచర్‌లపై కొరడా
వెంచర్‌లో హద్దురాళ్లను తొలగించి పంచాయతీకి తరలిస్తున్న సిబ్బంది

హద్దు రాళ్లను తొలగించిన గ్రామ పంచాయతీ సిబ్బంది

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన అధికారులు

ఆదిలాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బోథ్‌ మండల కేంద్రంలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన ‘‘డోంట్‌వర్రీ..అమ్మేసుకోండి’’ అనే వార్త కథనం ప్రచురితం కావడంతో స్పందించిన బోథ్‌ గ్రామ పంచాయతీ అధికారులు మండల కేంద్రానికి సమీపంలో సాయినగర్‌ కాలనీకి ఆనుకొని ఉన్న వెంచర్‌ను తొలగించారు. అనుమతులు లేని కారణంగా ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగించి గ్రామ పంచాయతీకి తరలించారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఓ టీఆర్‌ఎస్‌ నేత ఇష్టారాజ్యంగా చేసిన వెంచర్‌పై అధికారులు చర్యలు తీసు కోవడం బోథ్‌ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల్లో కలకలం రేపింది. ఇకపై అనుమతులు లేకుండా వెంచర్లను ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని సర్పంచ్‌ బొండ్ల సురేందర్‌యాదవ్‌, ఈవో సంజీవ్‌రావ్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-26T05:20:54+05:30 IST