అల్లర్ల బాధితులకు బాసటగా నిలుస్తాం

ABN , First Publish Date - 2020-03-02T12:35:09+05:30 IST

సంక్రాంతి పర్వదిన సమీపంలో భైం సా పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల కష్ట, నష్టాలపాలైన బాధిత కుటుంబాలకు సంఘం

అల్లర్ల బాధితులకు బాసటగా నిలుస్తాం

భైంసా, మార్చి1: సంక్రాంతి పర్వదిన సమీపంలో భైం సా పట్టణంలో చోటుచేసుకున్న అల్లర్ల కష్ట, నష్టాలపాలైన బాధిత కుటుంబాలకు సంఘం తరపున అవసరమైన సహాయ, సహాకారాలు అందించి బాసటగా నిలుస్తామని మున్నురుకాపు సంఘం నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాజయ్య వెల్లడించారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా మున్నురుకాపు సంఘం ప్రతినిధులతో కలిసి భైంసా లో పర్యటించి బాఽధితులను పరామర్శించారు. అల్లరిమూక లు జరిపిన దాడిలో దహనమైన, ద్వంసమైన, దెబ్బతిన్న నివాస గృహాలను పరిశీలించారు.


అనంతరం ఏర్పాటు చే సిన సమావేశంలో  మున్నురుకాపు నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాజయ్య మాట్లాడుతూ జిల్లా అధ్య క్షుడు డి.శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు సంఘం ప్రతినిధుల బృందం భైంసాలో పర్యటించడం జరిగిందన్నారు. ఇక్కడి పరిస్థితులు, బాధితుల స్థితి,గతులను జిల్లా సంఘానికి ని వేదిస్తామన్నారు. త్వరలోనే జిల్లా అధ్యక్షడు డి.శ్రీనివాస్‌ సారఽథ్యంలోని మున్నురుకాపు సంఘం నిజామాబాద్‌ జిల్లా యూనిట్‌ ఆధ్వర్యంలో బాధితులకు సహాయ, సహ కారాలు అందించి వారికి అన్ని విధాలుగా చేదోడు, వాదో డుగా నిలుస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సంఘ నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధులు బాలవర్ధి, ఆకుల రాజే శ్వర్‌, రామర్తి గంగాధర్‌, శరత్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2020-03-02T12:35:09+05:30 IST