ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2020-05-17T09:40:53+05:30 IST

రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం పట్టణంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం

జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ


భైంసా క్రైం, మే 16 : రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం పట్టణంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ గోదాం, మొక్కజొన్న నిలువ కేంద్రం గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటూ రైతులకు మేలు చేసే విధంగా చూస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు సామాజిక దూరం పాటించాలని సూచించారు. అనం తరం హమాలీలతో మాట్లాడి పలు సూచనలు, సలహలు అందజేశారు. తహసీల్దార్‌ నర్సయ్య, ఆర్డీవో రాజు, ఆర్‌ఐ పవీన్‌, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ గంగాచరణ్‌ తదితరులున్నారు.


గోదాంలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

పట్టణంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌, మొక్కజొన్న నిలువ ఉంచిన గోదాంలను శనివారం అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యం నిలువలను వెంట వెంటనే గోదాంలకు తరలించి నిలువ ఉంచుతున్నట్లు చెప్పారు. సరిపడ్డా గన్నీ బస్తాలు, కూలీలు కూడా అందుబాటులో ఉన్నారని అన్నారు. లారీల ద్వారా ఆయా కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యంను గోదాంలలో నిలువ చేస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం కూలీలకు పలు సలహాలు అంద జేసి నిలువ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ యన వెంట తహసీల్దార్‌ నర్సయ్య, ఆర్‌ఐ ప్రవీణ్‌,  రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ గంగాచరణ్‌, తదితరులున్నారు.


మండల కేంద్రమైన తానూర్‌ ను జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ శనివారం సందర్శిం చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్నను తానూర్‌ మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో నిల్వ చేశారు. ఈ సంద ర్భంగా తహసీల్దార్‌ శ్యాంసుందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నారాయణ్‌రావు పటేల్‌ను ఫంక్షన్‌హాల్‌లో నిల్వల గురించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు.


మండలంలో ఉన్న మొక్కజొన్న రైతులు ఎవరు ఆందోళన చెందవద్దు, మొక్కజొన్న పండించిన రైతుల పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం బేల్‌తరోడా గ్రామ సమీపంలోని మహా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం దగ్గరలో ఉన్న ఆర్టీవో చెక్‌ పోస్టును సందర్శించారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ సెంటర్‌ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతు తగు సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజు, తహసీల్దార్‌ శ్యాంసుందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నారా యణ్‌రావు పటేల్‌, అధికారులు తదితరులున్నారు.

Updated Date - 2020-05-17T09:40:53+05:30 IST