ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తాం

ABN , First Publish Date - 2020-04-28T05:47:28+05:30 IST

రైతులకు ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా ప్రతీ గింజనూ కొనుగో లు చేస్తామని ముథోల్‌ పీఏసీఎస్‌ (బిద్రెల్లి శా ఖ) చైర్మన్‌

ప్రతీ గింజనూ కొనుగోలు చేస్తాం

ముథోల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ తీగల వెంకటేష్‌గౌడ్‌


ముథోల్‌, ఏప్రిల్‌ 27 : రైతులకు ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా ప్రతీ గింజనూ కొనుగో లు చేస్తామని  ముథోల్‌ పీఏసీఎస్‌ (బిద్రెల్లి శా ఖ) చైర్మన్‌ తీగల వెంకటేష్‌గౌడ్‌ అన్నారు. ముథో ల్‌ ఉమ్మడి మండలంలో 13 వరి కొనుగోలు కేం ద్రాలు, ఆరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలతో పాటు రెండు సబ్‌సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సహకారంతో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్న ట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద లాక్‌డౌన్‌ దృష్ట్యా భౌతికదూరం పాటించాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగ కుండా అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు. గన్నీ బ్యాగు ల కొరత ఉన్నప్పటికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలి పారు. విత్తనాలు, ఎరువులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, రైతుల సంక్షేమమే పీఏసీఎస్‌ లక్ష్యమని అన్నారు.

Updated Date - 2020-04-28T05:47:28+05:30 IST