స్వర్ణ ప్రాజెక్టు కాలువ ద్వారా నీరు విడుదల

ABN , First Publish Date - 2020-12-19T06:07:32+05:30 IST

మండలంలో గల స్వర్ణ ప్రాజెక్టు ఎడమకాలువ ద్వారా ఎంపీపీ అట్ల మహి పాల్‌రెడ్డి సాగునీరును విడుదల చేశారు.

స్వర్ణ ప్రాజెక్టు కాలువ ద్వారా నీరు విడుదల
స్వర్ణప్రాజెక్టు కాలువ ద్వారా నీరు విడుదల చేస్తున్న దృశ్యం

సారంగాపూర్‌, డిసెంబరు 18 : మండలంలో గల స్వర్ణ ప్రాజెక్టు ఎడమకాలువ ద్వారా ఎంపీపీ అట్ల మహి పాల్‌రెడ్డి సాగునీరును విడుదల చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు సకాలంలో వరి నాట్లను వేసుకోవాలని తెలిపారు. స్వర్ణప్రాజెక్టు క్రింద ఉన్నటువంటి సాగుభూములన్నింటికీ సాగు నీరం దుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంగ రవీందర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్‌ నారాయణ రెడ్డి, రైతు కమిటీ మండల కో ఆర్డినేటర్‌ మధుకర్‌ రెడ్డి, ఎంపీటీసీ భోజరెడ్డి, స్వర్ణప్రాజెక్టు డీఈ అనిల్‌, పార్టీ మండలాధ్యక్షుడు మాధవ్‌రావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజ్‌మహ్మద్‌, మాజీ అడెల్లి మహ పోచమ్మ దేవాలయం చైర్మన్‌లు శ్రీనివాస్‌రెడ్డి, ఉట్ల రాజేశ్వర్‌, నాయకులు ఆది, మల్లేష్‌, చందు, లింగారెడ్డి, సృజన్‌లతో పాటు రైతులు, నాయకులు ఉన్నారు. 


Updated Date - 2020-12-19T06:07:32+05:30 IST