గ్రామాలకు దారులు బంద్‌

ABN , First Publish Date - 2020-03-24T12:43:03+05:30 IST

కరోనా ఎఫెక్ట్‌తో ఆ దిలాబాద్‌ జిల్లా సరిహద్దు గ్రామాలకు దారులు మూసుకు పోతు న్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లో

గ్రామాలకు దారులు బంద్‌

రావద్దంటూ హెచ్చరిక బోర్డులు


ఆదిలాబాద్‌, మార్చి23 (ఆంధ్రజ్యోతి) : కరోనా ఎఫెక్ట్‌తో ఆ దిలాబాద్‌ జిల్లా సరిహద్దు గ్రామాలకు దారులు మూసుకు పోతు న్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జైనథ్‌, బేల, తలమడుగు, తాంసి, భీంపూర్‌, బోథ్‌ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు త మ గ్రామానికి రావద్దంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రా మానికి వెళ్లే దారులను మూసి వేస్తూ ఈ నెల 31 వరకు ఎవరికి ప్రవేశం లేదంటూ హెచ్చరికలు చేస్తున్నారు. సోమవారం జైనథ్‌ మండలం డొల్లార గ్రామస్థులు గ్రామం బయట బోర్డును ఏర్పాటు చేసి ఎవరిని గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. 

Read more