ఓటరు నమోదుకు అన్ని పార్టీలు సహకరించాలి
ABN , First Publish Date - 2020-12-16T04:24:32+05:30 IST
ఓటరు నమోదు కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు తమ వంతు సహకారం అందించాలని ఓటరు నమోదు పరిశీలకురాలు, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖాధికారి డా.యోగితరాణా అన్నారు.
-రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖాధికారి యోగితరాణా
ఆసిఫాబాద్, డిసెంబరు15: ఓటరు నమోదు కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు తమ వంతు సహకారం అందించాలని ఓటరు నమోదు పరిశీలకురాలు, రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖాధికారి డా.యోగితరాణా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 2021 ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అన్ని పార్టీల నాయకులు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లా డుతూ 2021 జనవరి1 నాటికి 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకొనుటకు అర్హులన్నారు. ఇప్పటి వరకు అసలు నమోదు కాకుండా మిగిలిన వారిని ఓటర్లుగా నమోదు చేసుకునే విధంగా సహకరించాలన్నారు. ఓటరుగా పేర్లు నమోదు కార్య క్రమం ప్రత్యేకంగా కాకుండా ఆన్‌లైన్‌లో ఎన్‌వీఎస్పీ పోర్టల్ ద్వారా నిర్వీరామంగా ఎప్పుడైనా నమోదు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. వివిధ రాజకీయ పార్టీల వారు అందరు తమ నియోజక వర్గంలో కాకుండా జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్‌లకు పోలింగ్ జెంట్లను నియమించి అట్టి జాబితాను సంబంధింత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, రెవెన్యూ డివిజన్ అధికారికి సమర్పించాలన్నారు. ఓటర్ల సహాయ సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వారికి అందుబాటులో ఉండే విధంగా పోలింగ్ స్టేషన్‌ను పునర్విభజించాలని తెలిపారు. అనంతరం పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా రెవెన్యూ అధికారి సురేష్, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.