గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు

ABN , First Publish Date - 2020-12-27T03:58:30+05:30 IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు

-జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు 

కాగజ్‌నగర్‌ రూరల్‌, డిసెంబరు 26: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు అన్నారు. కాగజ్‌నగర్‌ మండలంలోని సీతానగర్‌, రాస్పెల్లి గ్రామాల్లో శనివారం పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాస్పెల్లి గ్రామంలో డీఎంఎఫ్‌టీ రూ.10 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి, ఎస్టీ వాడలోని జిల్లా పరిషత్‌ రూ.10లక్షలతో పలు సీసీ రోడ్ల నిర్మాణానికి, సీతానగర్‌ గ్రామంలో అంబేద్కర్‌ విగ్రహ ప్లాట్‌ ఫాం నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు సందేశ్‌ శర్మ, సర్పంచ్‌ బొమ్మెళ్ల పద్మ కిషన్‌, మాజీ జడ్పీటీసీ మౌల్కర్‌ లక్ష్మణ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గజ్జివాసుదేవ్‌, కో ఆప్షన్‌ సభ్యుడు బాబా, వార్డు సభ్యులు సంతోష్‌, నరేష్‌, నాయకులు లింగయ్య, రాజన్న, మాజీ సర్పంచ్‌ లింగయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T03:58:30+05:30 IST