ఇండ్ల స్థలాల కోసం గ్రామస్థుల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-28T10:19:42+05:30 IST

తాండూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సోమవా రం ప్రజలు ఆందోళన చేపట్టారు

ఇండ్ల స్థలాల కోసం గ్రామస్థుల ఆందోళన

తాండూర్‌ (బెల్లంపల్లి), జూలై 27: తాండూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సోమవా రం ప్రజలు ఆందోళన చేపట్టారు. సుభద్ర కాలనీ, ఎస్సీ కాలనీకి చెం దిన ప్రజలు 669 సర్వే నెంబరు లోని భూమి వద్దకు చేరుకుని స్థలాలు కేటాయించా లని కోరారు. కొందరు అక్రమార్కులు కబ్జా చేసి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు పట్టిం చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏం డ్లు భూమి లేక ఇండ్లు నిర్మిం చు కోలేకపోతున్నామని, ప్రభుత్వ భూమిని కేటాయిం చాలని ఆందోళన చేయడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్ర దించి  సమస్యను పరిష్కరిం చుకో వాలని సూచించారు. ప్రభుత్వ భూమిని నిరుపేద లకు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు  చేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-28T10:19:42+05:30 IST