పత్తి కొనుగోళ్లలో అక్రమాలు

ABN , First Publish Date - 2020-05-11T10:45:56+05:30 IST

పత్తి కొనుగోళ్ళలో అక్రమాలు జరుగుతున్నా యని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ అన్నారు.

పత్తి కొనుగోళ్లలో అక్రమాలు

 కోర్‌కమిటీ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు  రఘునాథ్‌


మంచిర్యాల అర్బన్‌, మే 10 : పత్తి కొనుగోళ్ళలో అక్రమాలు జరుగుతున్నా యని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌ అన్నారు. సెవెన్‌హిల్స్‌ హైస్కూల్‌లో ఆదివారం జిల్లా కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతీ కొనుగోలు సెంటర్‌కు 50 టోకెన్లు ఇస్తున్నారని,  టోకెన్ల జారీలో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వారి అనుచరులు, దళారులకు టోకెన్లు ఇస్తున్నాన్నారు. దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి సీసీఐకి పంపిస్తున్నారన్నారు. ప్రతీ రైతుకు తేదీ ల వారీగా టోకెన్లు ఒకేసారి జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. గోనె శ్యాంసుందర్‌రావు, మున్నారాజ్‌ సిసోడియా, రవీందర్‌, ఆరుముళ్ళ పోశం,  శ్రీనివాస్‌, కొయ్యల ఏమాజీ, వెంకటేశ్వర్‌గౌడ్‌, పురుషోత్తం పాల్గొన్నారు. 


తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

దండేపల్లి: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాధ్‌ వెరబెల్లి డిమాండ్‌ చేశారు.   కోర్విచెల్మలో ఆదివారం కేంద్రాన్ని సందర్శించారు. సరైన వసతులు లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కేంద్రంలో నెలకొన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండల అధ్యక్షుడు కోండ నరేష్‌, వెరబెల్లి రవీందర్‌ రావు, మెటపల్కుల చింటు శేఖర్‌, మల్లిఖార్జన్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-11T10:45:56+05:30 IST