వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు

ABN , First Publish Date - 2020-08-01T11:01:27+05:30 IST

మందమర్రి పట్టణంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతా లు మహిళలు ఘనంగా జరుపుకున్నారు.

వైభవంగా వరలక్ష్మీ వ్రతాలు

మందమర్రిటౌన్‌, జూలై 31: మందమర్రి పట్టణంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతా లు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. వరలక్ష్మీకి పూజలు నిర్వహించి నోములు నోచుకుని చుట్టు పక్కల మహిళలకు వాయినాలు అందజేశారు. కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆలయాలకు వెళ్లకుం డా ఇండ్లలోనే వ్రతం నిర్వహించుకున్నారు.


దండేపల్లి: శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని వరలక్ష్మి వ్రతాలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుతూ పూజలు నిర్వహించారు.  అనంతరం వాయినాలు ఇచ్చి పుచ్చుకొన్నారు. 


చెన్నూర్‌:  వరలక్ష్మీ వ్రతంను పట్టణ, మండల ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.  శివాలయం, జగన్నాథస్వామి, షిర్డి సాయిబాబా, అయ్యప్ప, పంచముఖ హనుమాన్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-08-01T11:01:27+05:30 IST