బాసరలో వైకుంఠ ఏకాదశి సందడి

ABN , First Publish Date - 2020-12-26T05:58:55+05:30 IST

బాసర సరస్వతి అమ్మవారిసన్నిధి శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పిల్లలకు అక్షరశ్రీకారపూజలు జరిపించేందుకు భక్తులు హాజరయ్యారు.

బాసరలో వైకుంఠ ఏకాదశి సందడి
అక్షర శ్రీకార పూజలు జరిపిస్తున్న భక్తులు

భారీగా అక్షరశ్రీకార పూజలు

బాసర, డిసెంబరు 25 : బాసర సరస్వతి అమ్మవారిసన్నిధి శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పిల్లలకు అక్షరశ్రీకారపూజలు జరిపించేందుకు భక్తులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి, పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి అధికసంఖ్యలో భక్తులు వచ్చా రు. రెండు అక్షర శ్రీకార మండపాల్లో వందలాది మంది పిల్లలు అక్షరశ్రీకార పూజలు నిర్వహించుకున్నారు. శుక్ర వారానికి తోడు పవిత్రదినం కలిసి రావడంతో భక్తుల తాకిడి పెరిగింది. కరోనాకారణంగా చాలా రోజుల తరు వాత అమ్మవారి సన్నిధి అక్షర శ్రీకార పూజలు జరి పించే చిన్నారులతో సందడిగా కనిపించింది.

Updated Date - 2020-12-26T05:58:55+05:30 IST