వైభవంగా వైకుంఠ ఏకాదశి

ABN , First Publish Date - 2020-12-26T05:24:16+05:30 IST

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలు భక్తు లతో పోటెత్తాయి. ఆదిలాబాద్‌లోని మార్వాడి ధర్మశాల బాలాజి వేంకటేశ్వర ఆలయంలో ఉత్తరద్వారా దర్శ నానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వైభవంగా వైకుంఠ ఏకాదశి
పూజలు నిర్వహిస్తున్న వేద పండితులు

ఆలయాలకు పోటెత్తిన భక్తులు

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 25: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలు భక్తు లతో పోటెత్తాయి. ఆదిలాబాద్‌లోని మార్వాడి ధర్మశాల బాలాజి వేంకటేశ్వర ఆలయంలో ఉత్తరద్వారా దర్శ నానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరా రు. కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున ఆలయంలో ప్రత్యేక పూజల అనం తరం భక్తులకు దర్శనం కల్పించారు. పర్వది నాన తరలివచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

Updated Date - 2020-12-26T05:24:16+05:30 IST