రైతు వేదిక నిర్మాణంపై కేటీఆర్‌కు ట్వీట్‌

ABN , First Publish Date - 2020-12-01T05:44:26+05:30 IST

బోథ్‌ మండలం పొచ్చెర గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులు నాసిరకంగా ఉన్నాయంటూ అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది.

రైతు వేదిక నిర్మాణంపై కేటీఆర్‌కు ట్వీట్‌
కేటీఆర్‌కు యువకుడు చేసిన ట్వీట్‌

నాసిరకం పనులపై జిల్లా అధికారులను ప్రశ్నించిన మంత్రి

ఆదిలాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): బోథ్‌ మండలం పొచ్చెర గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనులు నాసిరకంగా ఉన్నాయంటూ అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ట్విట్టర్‌కు స్పందించిన మంత్రి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తో పాటు సంబంధిత అధికారులను ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమా చారం. సోమవారం సెలవు రోజైనాఅధికారులు రైతువేదిక పనులను పరిశీలిం చేందుకు ఉరుకులు, పరుగులు పెట్టారు. వెంటనే పనుల నాణ్యతపై కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. నాసిరకం పనులపై ఆ గ్రామ సర్పంచ్‌ను హెచ్చరించారు.

Updated Date - 2020-12-01T05:44:26+05:30 IST