ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-09-13T10:16:58+05:30 IST

కొవిడ్‌ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు ..

ఆన్‌లైన్‌ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కిషన్‌రావు


కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 12: కొవిడ్‌ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు అన్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వినేలా చూడాలని ఆయన సూచించారు. శనివారం కాగజ్‌నగర్‌ విద్యాధరి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించినట్టు తెలిపారు.తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందిస్తేనే ప్రైవేటు పాఠశాలల కు మనుగడ ఉంటుందన్నారు.  ఈ సమావేశంలో ట్రస్మా సభ్యులు సూరవర్ధన్‌, సంజయ్‌సింగ్‌, సోని, జితేష్‌, సితాని, శంకర్‌, వైవీరావు, మెరాజ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-13T10:16:58+05:30 IST