పోలీసు అమరవీరులకు నివాళి

ABN , First Publish Date - 2020-10-24T10:51:05+05:30 IST

పోలీసు అమరవీరుల సంస్మర ణ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు

పోలీసు అమరవీరులకు నివాళి

నస్పూర్‌, అక్టోబరు 23: పోలీసు అమరవీరుల సంస్మర ణ వారోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి ర్యాలీ నిర్వహించి షిర్కే చౌరస్తాలో దీపాలను వెలిగించి నివాళులర్పించారు. సీఐ కుమారస్వామి, ఎస్సై ప్రమోద్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు. 


రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు అభినందనీయం

హాజీపూర్‌ : రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు ప్రశంసనీయమ ని గుడిపేట కమాండెంట్‌ ఇన్‌చార్జి ఎస్పీ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. భాస్కర్‌రెడ్డి, మహేం దర్‌, నాగనాయక్‌, రఘునాథ్‌చౌహాన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-24T10:51:05+05:30 IST