మహాత్మాగాంధీకి ఘన నివాళి
ABN , First Publish Date - 2020-10-03T10:37:43+05:30 IST
జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం గాంధీజీ చిత్రపటాలకు నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో శుక్రవారం గాంధీజీ చిత్రపటాలకు నాయకులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 2: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ భారీతి హోళికేరి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు గాంధీజిని స్మరిస్తూ అలరించిన గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్‌కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారి వి. వెంకటేశ్వర్లు, ఏఓ సురేష్, గెడెం గోపాల్, కళాకారులు నామిళ్ళ లక్ష్మణ్, శ్రావణ్, కొప్పర్తి రవీందర్, పోశం తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, వైస్ చైర్మన్ మహేందర్, సభ్యులు నాగేందర్, ఎడ్ల కిషన్, మధుసూదన్ రెడ్డి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గడియారపు శ్రీహరి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు భూముల రామ్మోహన్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కేజియ రాణి, సునీత, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. పత్తిగట్టయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీజి జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పత్తి వెంకటేష్, సభ్యులు విద్యాసాగర్, టిల్లు, పన్యాల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏసీసీ: పట్టణంలోని గాంధీ పార్కులో గల గాంధీజీ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకట కృష్ణ, మహిళ మోర్చా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని హరికృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ, శాస్త్రిల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు అధ్యక్షుడు లింగంపల్లి ప్రేమ్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ మద్ది లక్ష్మణ్, జాగృతి జిల్లా నాయకులు సిడాం శంకర్, మల్లేశం, సాహిత్య విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేశం గౌడ్, మాడే మాంతయ్యలు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖాధికారి సప్తర్ అలీఖాన్ జాతిపిత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాశాఖాధికారి పురుషోత్తం నాయక్, సెక్టోరల్ అధికారి పద్మజ, సైన్స్ అధికారి మధుబాబు, ఆఫీస్ పర్యవేక్షకులు సత్యనారాయణ పాల్గొన్నారు. ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల మార్కెట్ రోడ్డు వారి ఆధ్వర్యంలో తెలంగాణ మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం, పండ్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్కులో గల గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పెంట రజితలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
లక్షెట్టిపేట: పట్టణంలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పలు పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయ కుల ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో గల గాంధీ విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపాలిటీ చైర్మన్ నలమాచు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, కమిషనర్ తిరుపతి, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారం సుధాకర్, తాహసీల్ధార్ రాజ్ కుమార్, ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు. పట్టణంలోని గాంధీ విగ్రహానికి డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పూల మాల వేసినివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్: నస్పూర్ మున్సిపల్ కార్యాలయంలో గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు ఆర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కమిషనర్ రాధా కిషన్ కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు నస్పూర్ కాలనీలోని పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాఽధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు బడిక మల్లయ్య, అన్నపూర్ణ, పంబాల గంగ, గ్రామ కమిటీ అద్యక్షుడు సంపత్ కుమార్, నాయకులు ఖాసీం, ముత్తె రాజేశం, కమాలాకర్ రావు, హైమద్, దగ్గుల మధు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని సీసీసీ కార్నర్ వద్ద డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ్ళ వేణు, కౌన్సిలర్లు సీపతి సుమతీ మల్లేష్, బొద్దున సంధ్యారాణి, రజిత, మహిళా కమిటీ అధ్యక్షురాలు శ్యామల, నాయకులు మల్లేష్, రాంమూర్త్తి, తిరుపతి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి: మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ గ్రామాల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాలు, టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, వర్తక సంఘం ఆఽధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, సహాకార సంఘం చైర్మన్ కాసనగోట్టు లింగన్న, వైస్ ఛైర్మన్ అక్కల రవీందర్, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శు చుంచు శ్రీనివాస్, బండారి వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
జన్నారం: మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి జడ్పీటిసీ ఎర్రచంద్రశేఖర్, ఎంపీపీ సరోజన, పోన్కల్ సర్పంచ్ జాక్కు భూమేష్ ఆవోపా అధ్యక్షుడు వేణుగోపాల్ గుప్తాలు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భరత్‌కుమార్, నాయకులు ముత్యం, సతీష్, రజాక్, మున్వర్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: పట్టణంలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గాంధీచౌక్‌లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ అర్చనాగిల్డా, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కమీషనర్ రమేష్, కౌన్సిలర్లు , కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. స్వేరోష్ ఫిట్ ఇండియా ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అర్చనాగిల్డా, సీఐ ప్రమోద్‌రావు, ఎస్‌ఐ శివకుమార్, వైద్యులు అరుణశ్రీ, పీఈటీలు దాసరి మల్లేష్, జయశ్రీ, మనోహర్, సాగర్ , అనిత , రామయ్య, ప్రకాష్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వైద్యులు సత్తయ్య, మల్లిక్, వెంకటనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఆస్నాద గ్రామపంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణంతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎఎమ్మెల్యే సొత్కు సంజీవరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అంకగౌడ్, పట్టణాధ్యక్షుడు శ్రీధర్, నాయకులు భూషణ్‌శర్మ, సూర్యనారాయణ, మధునయ్య, మల్లయ్య, రాంరెడ్డి, బషీర్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్: మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు డేగబాపు, బాలరాజు, నాయకులు కొట్టె లచ్చన్న, కుటుంబరావు, మండల అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీ సీఈఓ నరేందర్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఏ హై, ఎపీఓ రవిబాబు, ఏపీఓ మల్లయ్య, ఎంపీపీ స్వర్ణలత శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో డీపీఓ వి. సత్యనారాయణరావు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ టి. ప్రభాకర్‌రావు, ఏఓ సాధిక్ అలీ, డీపీఎం నరేందర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిటౌన్: పట్టణంలో బీజేపీ పట్టణాద్యక్షుడు మద్ది శంకర్ ఆధ్వర్యంలో నాయకులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు మురళీ తదితరులు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు కొంగల తిరుపతిరెడ్డి, తోట సురేందర్, బట్టు రాజ్‌కుమార్, మేడిపల్లి సంపత్, జె. రవీందర్, బడికెల సంపత్ , బత్తుల శ్రీనివాస్, ఎర్ర రాజు, ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘునాధ్‌రెడ్డి, ముజాయిద్, రమేష్, ఉపేందర్‌గౌడ్, రమేష్, రాజన్న, జీవన్, రజనీ, సుకుర్, జమీల్, సంతోష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ అంగడి బజార్ ఏరియాలో గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రావికంటి వెంకటేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రాచర్ల గణేష్, చంద్రకాంత్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
భీమారం: మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ తిరుమల, సర్పంచ్ రాంరెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయానందం, వ్యవసాయ కార్యాలయంలో ఏఈవో అరుణ్‌కుమార్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రాజేందర్‌లు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో శ్రీనివాస్, కార్యదర్శులు, సర్పంచులు, నాయకులు భుక్య లక్ష్మణ్, భరత్, నాగరాజు పాల్గొన్నారు.
జైపూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గోదారి రమాదేవి, జడ్పీటీసీ మేడి సునీత ఆద్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రసాద్‌వర్మ, మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో మార్క్‌గ్లాడ్‌సన్‌లు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కే నాగేశ్వర్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి కే సతీష్‌కుమార్, మండల ఉపాదిహామీ అధికారి బాలయ్య, ఎంపీటీసీ సభ్యులు రాంటెంకి లింగస్వామి, అరవిందరావు, వెంకటేశ్వర్ గౌడ్, బీమిని రాజయ్య, బేతి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటాపూర్ గ్రామంలో గాంధీజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు శ్రీనివాస్‌గౌడ్, కార్యాలయం సిబ్బంది రవీందర్, శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి టౌన్:పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఆవరణలో గల గాంధీజి విగ్రహానికి పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేంసాగర్‌రావు, కిసాన్‌సెల్ రాష్ట్ర అద ్యక్షుడు అన్వేష్‌రెడ్డిలు, పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు కంకతి శ్రీనివాస్‌తో కలిసి పూల మాలలు వేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యర్తలు గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు బండి ప్రభాకర్ యాదవ్, చిలుముల శంకర్, వర్దన్‌రాజు, వినేష్, విజయ్‌కమార్, మహేష్, రమేష్‌బాబు, తుంగల మల్లేష్, సతీష్, ఆర్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి: పట్టణంలోని గాంధీజీ విగ్రహానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మణ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజశేఖర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి టౌన్:మహాత్మాగాంధీ జయంతి వేడుకలను బీజేపీ పట్టణ అద్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్, బీజేపీ పార్టీ జిల్లా, పట్టణ నాయకులు రేవెల్లి రాజలింగు, ముడిమడుగుల శ్రీనివాస్, ఎరుకల శ్రీనివాస్, కాసర్ల యాదగిరి, సబ్బనిరాజనర్సు, రాంచందర్, కే విజయ్, వాల్మీకి సునీల్, కే అరవింద్, మత్తమారి రాజమల్లు, గుర్రం ప్రదీప్‌కుమార్, అరిసెల్ల రమేష్, రుద్రచల కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి: కోటపల్లిలో సర్పంచ్ రాగం రాజక్క, రాంపూర్‌లో పిల్లి భారతి, షెట్‌పల్లిలో ఉమాశశిపాల్‌రెడ్డి, ఉపసర్పంచు గోనే మోహన్‌రెడ్డి, పిన్నారంలో లస్మక్క, నాగంపేటలో కామెర పద్మలతో పాటు పలు పంచాయతీల్లో సర్పంచ్‌లు గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీటీసీ పుప్పిరెడ్డి మొండక్క, కార్యదర్శులు శ్యామల, రవళి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట: మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా తహసీల్దార్ కార్యాలయం లో నిర్వహించిన వేడుకలకు మండలస్థాయి అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో జాతిపిత గాంధీజయంతిని అటెండర్లు నిర్వహించడం గమనార్హం.
భీమిని: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి లక్ష్మణ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాధాకృష్ణ, ఎంపీఓ విజయ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి: మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో లక్ష్మీనారాయణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏపీవో సత్యప్రసాద్, ఈసీ మషధుకర్, కార్యాలయం సిబ్బంది రవి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్: ఏరియాలోని రెస్క్యూ స్టేషన్ ఆవరణలో జనరల్ మేనేజర్ (సేఫ్టీ) బీపీఏ రీజియన్ బళ్ళారి శ్రీనివాసరావు, రెస్క్యూ స్టేషన్ ఇన్‌చార్జి ఎస్. జక్కారెడ్డిలు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రెస్క్యూ స్టేషన్ సభ్యులు ఎన్. సదయ్య, కె. గణేష్ రామన్, ఎస్. మనోహర్, కె. శ్రీనివాస్, ఆర్. తిరుమలరావు, కె. శ్రీధర్ రెడ్డి, వై. చిరంజీవి, జి. సదాశివకుమార్‌లు పాల్గొన్నారు. ఆర్కేపీ సీఎస్పీలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు టి. రమణారావు, డి. గంగాధర్, డి. శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, కాంపెల్లి నర్సయ్య, సత్తయ్య, బిరుదు రవీందర్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.