కరోనా కట్టడికి గిరిజనుల పూజలు
ABN , First Publish Date - 2020-03-23T10:34:52+05:30 IST
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు తుడుం మోగించారు. తమ సాంప్రదాయం ప్రకారం గ్రామ

తలమడుగు, మార్చి 22: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు తుడుం మోగించారు. తమ సాంప్రదాయం ప్రకారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి తమ గ్రామాల్లోకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ప్రతీఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అదే విధంగా తమ సాంప్రదాయ నృత్యమైన డోలు డేంసాతో తుడుం మోగించి కరోనా కట్టడికి ప్రతీఒక్కరు కట్టుబడి ఉండాలని కోరారు.
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లోనూ తమ కులదేవతల ఆలయాల వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించారు. అదే విధంగా కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరూ బయటకు వెళ్లకుండా స్వీయ నిర్భందంలోనే గడిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం మారుమూల గ్రామమైన కొండపైనుండే రత్నాపూర్ గ్రామంలో గిరిజనులు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రత్యేక పూజలను నిర్వహించారు.