గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు వెంటనే చేపట్టాలి
ABN , First Publish Date - 2020-12-14T03:50:08+05:30 IST
గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ జేఏసీ రాష్ట్ర నాయకులు గెడెం చందన్, ప్రేమ్‌దాస్ డిమాండ్ చేశారు.

మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 13: గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ జేఏసీ రాష్ట్ర నాయకులు గెడెం చందన్, ప్రేమ్‌దాస్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన సమావేశంలో జేఏసీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్న సందర్భంగా వారు మాట్లాడారు. గిరిజన ఉపాధ్యాయులకు కామన్ సర్వీసెస్ రూల్స్ అమలు చేయాలని కోరారు. 24 సంవత్సరాల ఇంక్రిమెంట్, బీఈడీ డిపార్ట్‌మెంట్ టెస్ట్ లేకుండానే ఇవ్వాలని చెప్పారు. గిరిజన ప్రాథమిక పాఠశాలలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ శాఖల అటెండర్ అపాయింట్‌మెంట్ ఐడీ వరకు ప్రమోషన్ పొందుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల నియామకం ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్లు లేకపోవడం సరికాదని చెప్పారు. సాధారణంగా వర్తించే ప్రమోషన్లు, హాస్టల్ వార్డెన్, డీటీడబ్ల్యూవో, ఏటీడీవో, టూటీడీలు ప్రమోషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘాల ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.