నర్సరీలపై శిక్షణాతరగతులు

ABN , First Publish Date - 2020-09-29T05:54:21+05:30 IST

జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం నుంచి హరితహారం నర్సరీలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణాతరగతులు

నర్సరీలపై శిక్షణాతరగతులు

భీమారం, సెప్టెంబరు 28: జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం నుంచి హరితహారం నర్సరీలపై ప్రజాప్రతినిధులు, అధికారులకు శిక్షణాతరగతులు నిర్వహించారు.  భీమారం మండల కేంద్రంలోని జోడువాగుల సమీ పంలో గల సెంట్రల్‌ నర్సరీలో భీమారం, జైపూర్‌ మండలాల సర్పం చులు, కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది, వన సేవకులకు డీఆర్‌డీవో పీడీ శేషాద్రి ఆధ్వర్యంలో సోమవారం  జైపూర్‌ ఎంపీడీవో నాగేశ్వర్‌రావు, భీమారం ఎంపీడీవో శ్రీనివాస్‌లు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటి ఎఫ్‌ఆర్‌వో సాగరిక తదితరులు పాల్గొన్నారు.


వేమనపల్లి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 20 20-21 సంవత్సరానికి ప్రతి గ్రామంలో నర్సరీల పెంపకంపై సోమవారం ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఫారెస్టు రేంజ్‌ అధికారి బాబు పటేకర్‌లు సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందికి అవగాహన కల్పించారు. సమావేశంలో ఎంపీవో అనిల్‌కుమార్‌, ఏపీవో సత్య ప్రసాద్‌, సాంకేతిక సహాయకులు, వన సేవకులు పాల్గొన్నారు.


లక్షెట్టిపేట: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నర్సరీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ అన్నం మంగ అధ్యక్షత వహించగా, ఎఫ్‌ఆర్‌ఓ నాగనాధ్‌ స్వామి, నరేష్‌ ఉపాధి హామి సాంకేతిక సహాయకులు నర్సరీలో మొక్కల పెంపకంపై మెలకువలు ప్రిపరేషన్‌ ఆఫ్‌ ఫిట్టింగ్‌ ప్రైమరీ బెడ్స్‌ ఏ విధంగా నిర్వహించాలి విత్తనాలు మరియా పొడవైన మొక్కలు ఎ పద్దతిలో పెట్టడంపై సర్పంచ్‌లకు పంచాయితీ కార్యదర్శులకు సర్సరీ వన సేవకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్షేట్టిపేట జడ్పిటిసి ముతై సత్తయ్య, పి దేవేందర్‌ రెడ్డి, మండల ప్రతేక అధికారి వినోద్‌ కుమార్‌, ఎంపిడివో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


కాసిపేట: వచ్చే ఏడాది హరితహారానికి నర్సరీలను సిద్ధం చేయడం కోసం స్ధానిక ప్రజాప్రతినిధులకు అటవీ శాఖ అధికారులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు.  అటవీ సెక్షన్‌ అధికారి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ 22 గ్రామపంచాయతీల్లో నర్సరీల స్థలాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్లు తేజస్వి, అస్మా, ఎ ంపీడీవో ఆలీం, ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


మందమర్రిరూరల్‌: హరితహారంలో భాగంగా 2020-21 సంవత్సరానికి గాను ప్రజాప్రతినిధులకు, ఉపాధిహామీ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వేల్పుల రవి మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని  తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు గౌరీ శంకర్‌  చెట్లకు కావాల్సిన జీవామృతం చేసే విధానాన్ని ప్రత్యక్షంగా తయారు చేసి అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ రాజ్‌కుమార్‌, ఎంపీవో షేక్‌ సప్దర్‌ ఆలీ, ఏపీవో రజియా సుల్తానా, బీట్‌ అధికారి వెంకటేశ్వర్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీలు , పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, వన సేవకులు పాల్గొన్నారు. 


భీమిని: మండలంలోని అధికారులకు  నీల్వాయిపల్లిలో  నర్సరీల నిర్వహణపై అటవీశాఖ అధికారులు  ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరితహారంలో మొక్కలు పెంచడం, వాటి రక్షణ విధానం పై డిప్యూటీ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి రమాదేవి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీఓ ప్రసాద్‌, ఏపీఓ భాస్కర్‌ రావు, కార్యదర్శులు, సర్పంచులు, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T05:54:21+05:30 IST