ట్రాఫిక్‌ పోలీసుల శ్రమదానం

ABN , First Publish Date - 2020-12-28T05:57:07+05:30 IST

జిల్లా కేంద్రంలోని నేతాజిచౌక్‌ సమీపంలో కల్వర్టుపై ఉన్న ఇనుప రాడ్లు బయటకు వచ్చిప్రమాదకరంగా మారాయి. రాడ్లు బయటకు రావడంతో పలువురు వాహనదారులు తరచూ ప్రమాదాల బారీన పడుతున్నారు.

ట్రాఫిక్‌ పోలీసుల శ్రమదానం
రాడ్లు బయటకు కనబడకుండా సిమెంట్‌తో మూసివేస్తున్న దృశ్యం

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెంబరు 27: జిల్లా కేంద్రంలోని నేతాజిచౌక్‌ సమీపంలో కల్వర్టుపై ఉన్న ఇనుప రాడ్లు బయటకు వచ్చిప్రమాదకరంగా మారాయి. రాడ్లు బయటకు రావడంతో పలువురు వాహనదారులు తరచూ ప్రమాదాల బారీన పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో ఉండే పోలీసులు దీన్ని గమనించారు. వెంటనే సిమెంట్‌, ఇసుక, కంకర తెప్పించి ఇనుప రాడ్లు కనబడకుండా మరమ్మతులు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ సీఐ పేర్ల గంగాధర్‌, ఎస్సై అబ్దుల్‌ బాకీ, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తదితరులున్నారు.

Updated Date - 2020-12-28T05:57:07+05:30 IST