ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-12-26T04:47:58+05:30 IST

ట్రాక్టర్‌ బోల్తా పడి గురువారం రాత్రి ఒకరు మృతి చెందినట్లు ఏఎస్సై రహమాన్‌ఖాన్‌ తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరి మృతి

గుడిహత్నూర్‌, డిసెంబరు 25: ట్రాక్టర్‌ బోల్తా పడి గురువారం రాత్రి ఒకరు మృతి చెందినట్లు ఏఎస్సై రహమాన్‌ఖాన్‌ తెలిపారు.  ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన యటకార్ల ఆశన్న(45) అనే ట్రాక్టర్‌ డ్రైవర్‌ మావల నుంచి మండలంలోని తోషం గ్రామానికి ఇటుకల లోడుతో వచ్చాడు. తిరిగి వెళ్తుండగా దేవాపూర్‌ చెక్‌పోస్టు సమీపంలో జాతీయ రహదారిపై అడవిపందులు ట్రాక్టర్‌కు అడ్డురాగా వాటిని తప్పించే ప్రయత్నంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆశన్న తీవ్రంగా గాయపడడంతో అతన్ని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. పరిస్థిత విషమంగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో నిర్మల్‌ సమీపంలో మృతి చెందినట్లు ఏఎస్సై వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-12-26T04:47:58+05:30 IST