నేరస్థులను పట్టుకోవడానికిసాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించాలి
ABN , First Publish Date - 2020-03-13T12:48:03+05:30 IST
పోలీసు అధికారులు నేరస్థులను ప ట్టుకోవడానికి పాత పద్ధతులను వీడి పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఙానాన్ని

నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు
నిర్మల్, మార్చి12 (ఆంధ్రజ్యోతి): పోలీసు అధికారులు నేరస్థులను ప ట్టుకోవడానికి పాత పద్ధతులను వీడి పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి ముందుకెళ్లాలని నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. శుక్రవార ం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శశిధర్‌రాజు ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌ల క్రైమ్ స్టాఫ్, జనరల్, వర్టికల్ అధికారులకు ఒకరోజు శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా నేరస్థుల నుంచి వెంటనే వేలిముద్రలను సేకరించి, టవర్‌డంప్‌ల సహాయంతో డే టాను సేకరించి విశ్లేషించడం ద్వారా సీసీ పుటేజీలను సేకరించి జిల్లా పోలీ సు కార్యాలయంలో సైబర్ ట్యాబ్‌లో వీడియో పరిశీలిస్తే నేరస్థులను త్వరగా పట్టుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ ఎస్సై రమేష్‌బాబు, ఐటీ కోర్ ఇ న్‌చార్జి ఎస్‌కె మురాద్ ఆలీ, సిబ్బంది పాల్గొన్నారు.