టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది

ABN , First Publish Date - 2020-12-11T04:41:06+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మో సం చేస్తోందని, రైతులపై కపట ప్రేమ చూపుతోందని బీజేపీ ఎల్లారె డ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీ బాణాల లక్ష్మారెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది
మాట్లాడుతున్న బాణాల లక్ష్మారెడ్డి

బీజేపీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీ బాణాల

లింగంపేట, డిసెంబరు 10: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మో సం చేస్తోందని, రైతులపై కపట ప్రేమ చూపుతోందని బీజేపీ ఎల్లారె డ్డి నియోజకవర్గ ఇన్‌చార్జీ బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం  మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి రెండు సంవత్సరాలు దాటినా ఇంతవరకు చేయలేదన్నారు. సన్న రకం ధా న్యంను పండించాలని చెప్పి నష్టపోతే ఆదుకోవడం లేదన్నారు. కార్య క్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు దత్తురాం, ఉపాధ్యక్షుడు ఉదయ్‌, నాయకులు సాయిలు, శ్రీనివాస్‌, నవీన్‌కుమార్‌, అల్లూరి, మహెందర్‌, నందు, సంగయ్య తదితరులు ఉన్నారు.

రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు..

కామారెడ్డిటౌన్‌: రాజకీయంగా ఎదుర్కోలేక దాడులు చేయడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కాటిపల్లి వెంకటరమణరెడ్డి విమ ర్శించారు. పట్టణంలోని లింగాపూర్‌ గ్రామంలో అధికార పార్టీకి చెంది న కొందరు కార్యకర్తలు, నాయకులు బీజేవైయం జిల్లా ప్రధానకార్యద ర్శి నరేందర్‌ రెడ్డి ఇంటిపైౖకి వచ్చి దాడులు చేయడం పిరికిపందల చ ర్య అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కొవాలని హితవుపలికారు. ఈ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, నాయకులు శ్రీనివాస్‌, మహేష్‌గుప్త, నాగర్తి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T04:41:06+05:30 IST