సర్వేను వేగవంతం చేయాలి-మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌

ABN , First Publish Date - 2020-10-19T10:14:54+05:30 IST

ధరణి సర్వేను వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు వార్డుల్లో ధరణి సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు.

సర్వేను వేగవంతం చేయాలి-మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌

కాగజ్‌నగర్‌, అక్టోబరు 18: ధరణి సర్వేను వేగవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ పట్టణంలోని పలు వార్డుల్లో ధరణి సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బందికి కమిషనర్‌ పలు సూచనలు, సలహాలను అందజేశారు. ధరణి సర్వేలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలపై ఉన్నతాధికారులకు వివరించినట్టు తెలి పారు. వివిధ సమస్యలను కమిషనర్‌ దృష్టికి సిబ్బంది తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-10-19T10:14:54+05:30 IST