గడువులోగా సర్వే పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-10-07T06:07:51+05:30 IST
వ్యవసాయేతర ఆస్తుల సర్వేను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని శిర్షా

జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి
కోటపల్లి, అక్టోబరు 6: వ్యవసాయేతర ఆస్తుల సర్వేను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలంలోని శిర్షా గ్రామంలో కొనసాగుతున్న ధరణి సర్వేను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే కొనసాగుతున్న విధానం, ఇప్పటి వరకు పూర్తయిన సర్వే వివరాలు, ఇంకా చేపట్టాల్సిన కుటుంబాల సంఖ్య, ధరణి అప్‌లోడ్ తీరు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. గ్రామంలోని అన్ని కాలనీల్లో పర్యటించి గ్రామీణులకు సర్వేపై అవగాహన కల్పించారు. ఆమె వెంట ఎంపీడీవో భాస్కర్, సూపరింటెండెంట్ లక్ష్మయ్య, ఎంపీవో సత్యనారాయణ, సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, ఉపసర్పంచ్ పున్నంచంద్ ఉన్నారు.
హాజీపూర్: మండలంలోని ముల్కల్ల గ్రామంలో చేపడుతున్న హౌస్ అసెస్‌మెంట్ సర్వేను మంగళవారం మండల పంచాయతీ అధికారి కె. రవిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట కారోబార్ సత్యనారాయణ ఉన్నారు.
వేమనపల్లి: గ్రామాల్లో చేపడుతున్న ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు సూచించారు. మంగళవారం వేమనపల్లి మండలంలోని నీల్వాయి, ముల్కలపేట, క్యాతనపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటి సర్వేను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో అనిల్‌కుమార్, సర్పంచు రాజలింగు, కార్యదర్శులు నారాయణ, పోషమల్లు, జాఫర్ ఆలీ ఉన్నారు.
జన్నారం: గ్రామాల్లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని స్వచ్ఛభారత్ మిషన్ సంచాలకులు దిలీప్‌కుమార్ అన్నారు. మండలంలోని కొండకల్, జన్నారం గ్రామాల్లో జరుగుతున్న సర్వేను మంగళవారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య కార్యనిర్వాహణ అధికారి నరేందర్, ఎంపీడీఓ అరుణారాణి తదితరులు పాల్గొన్నారు.
మందమర్రిరూరల్: గ్రామాల్లో జరుగుతున్న ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ సూచించారు. మంగళవారం అందుగుల పేట గ్రామంలో సర్వేను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో షేక్ సప్దర్ ఆలీ, పంచాయతీ కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి టౌన్: పట్టణంలోని 31వ వార్డులో మున్సిపల్ సిబ్బంది ఇంటింటా తిరుగుతూ ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. వార్డు కౌన్సిలర్ గెల్లి రాయలింగుయాదవ్ ఆద్వర్యంలో సర్వే కొనసాగుతోంది. సర్వేలో మున్సిపల్ అధికారి జి ప్రదీప్‌కుమార్, ఆర్‌పి రమణమ్మ, టీఆర్‌ఎస్ నాయకులు సన్ని యాదవ్, రాంకుమార్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి: ఇంటింటి ఆస్తుల సర్వే నమోదును పకడ్బందీగా చేపట్టాలని స్వచ్ఛభారత్ మిషన్ రాష్ట్ర సంచాలకులు దిలీప్‌కుమార్, జడ్పీ సీఈవో నరేందర్ అన్నారు. దండేపల్లి మండలం ముత్యంపేట, నెల్కివెంకటాపూర్ గ్రామాలల్లోని మంగళవారం ఇంటింటా నమోదు సర్వేను వారు పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మేఘమాల ఉన్నారు.
హాజీపూర్: మండలంలోని దొనబండ గ్రామంలో జరుగుతున్న హౌస్ అసెస్‌మెంట్ సర్వేను రాష్ట్రస్థాయి పరిశీలకుడు దిలీప్‌కుమార్‌తో కలిసి జడ్పీసీఈఓ నరేందర్‌లు మంగళవారం పరిశీలించారు. వారి వెంట ఎంపీడీఓ ఎంఏ హై, ఎంపీఏఓ రవిబాబు, సర్పంచ్ జాడి సత్యం, పంచాయతీ కార్యదర్శి మాధవ్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు.