తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , First Publish Date - 2020-09-12T10:53:35+05:30 IST
తెలంగాణ సాయుధ పోరాట అమరవీ రుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు, పట్టణ కార్యద ర్శి, ..

మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 11: తెలంగాణ సాయుధ పోరాట అమరవీ రుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు, పట్టణ కార్యద ర్శి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్, ఖలీందర్‌ఖాన్, మేకల దాసు పేర్కొన్నారు. శుక్రవారం సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయ ఆవరణలో, ఐబీ చౌరస్తాలో అమరవీరుల సంస్మర ణార్ధం జెండాను ఆవిష్కరించారు.
సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూ నిస్టులు, కర్షకులు ప్రాణత్యాగం చేసి అమరులయ్యారని, 10 లక్షల ఎకరాల భూ మిని పేద ప్రజలకు పంచిన కమ్యూనిస్టు నాయకుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. సాయుధ పోరాటాలలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. ఈనెల 17వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జోగుల మల్లయ్య, లింగం రవి, మిట్టపల్లిపౌలు, బియ్యాల రాజేశం, మహేందర్ రెడ్డి, శంకరయ్య, వీబీ రావు. రవీందర్, రజిని పాల్గొన్నారు.
నస్పూర్ : గోదావరి కాలనీలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలం గాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించా రు. జెండాను సీపీఐ నాయకులు మిర్యాల రాజేశ్వర్‌రావు ఆవిష్కరించగా కౌన్సిలర్ మేకల దాసు, జోగుల మల్లయ్య,లింగం రవి, సమ్మయ్య, నగేష్ పాల్గొన్నారు.