ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-12-30T05:28:33+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో గుడిహత్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు.
గుడిహత్నూర్, డిసెంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో గుడిహత్నూర్‌లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి పంపిణీ చేస్తానని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని రైతులకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు నాయకులను సముదాయించి రాస్తారోకో విరమింపచేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కేంద్రే లక్ష్మణ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, జడ్పీటీసీ పతంగే బ్రహ్మానంద్, వైస్ ఎంపీపీ భారత్, పీఏసీఎస్ చైర్మన్‌ముండే సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.