క్షణ క్షణం భయం భయం
ABN , First Publish Date - 2020-04-21T09:09:49+05:30 IST
జిల్లాలో మళ్లీ కరోనా భయం మొదలయ్యింది. వారం రోజుల వరకు 11 కేసులతో ప్రశాంతంగానే కనిపిం

జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య
బయట పడుతున్న సెకండరీ కాంటాక్ట్ కేసులు
కట్టడి ప్రాంతాలపై కొరవడుతున్న నిఘా
పరిస్థితి పట్టుతప్పితే మరింత ప్రమాదమేల
ఆదిలాబాద్, ఏప్రిల్20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ కరోనా భయం మొదలయ్యింది. వారం రోజుల వరకు 11 కేసులతో ప్రశాంతంగానే కనిపిం చినా.. గడిచిన 3 రోజుల వ్యవధిలోనే కొత్తగా 8 కేసులు నమోదుకావడం సర్వత్రా ఆందోళన రేపు తోంది. దీంతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. ఢిల్లీ మర్కజ్ కేసులపై స్పష్టత రావడంతో దాదాపుగా జిల్లాకు కరోనా ముప్పు తప్పినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమ య్యాయి. ఆ తర్వాత వారి కాంటాక్ట్ కేసులు 3 బయట పడగా తాజాగా ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో మరో 5 కొత్త కేసులను అధికారులు గుర్తించారు. పట్టణంలో లాక్‌డౌన్ నిబంధనలు పట్టించుకోకపోవడంతో కాంటాక్ట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 481 రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా 19 పాజిటివ్‌గా నమోదయ్యాయి.
బయటపడుతున్న కాంటాక్ట్ కేసులు..
మర్కజ్ కేసులతో లింకున్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ కేసులు ఇప్పుడిప్పుడే బయట పడుతు న్నాయి. ఈ సమయంలోనే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో 16 రోజుల పాటు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాల్సి ఉంటుంది. స్థానికంగా వైరస్ విస్తరిస్తే ఆపడం కష్టసాధ్యమంటున్నారు. మొదట 116 ప్రైమరీ కాంటాక్ట్ కేసులలో ఒకరికి పాజిటివ్ రాగా సెకండరీ కాంటాక్ట్‌గా చేపట్టిన 192 నమూనాల పరీక్షలలో 3 పాజిటివ్, తాజాగా పంపిన 97 నమూనాలలో 5 పాజిటివ్ కేసులు నమోద య్యాయి. అంటే రోజురోజుకూ వైరస్ తీవ్రత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కాంటాక్ట్ కేసులన్నీ ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో ఇంకెన్నీ లింకులు ఉన్నాయో తెలియాల్సి ఉంది.
కొరవడుతున్న నిఘా..
జిల్లాలోని 19 వార్డులు, 2 మండలాల పరిధి లోని పలు గ్రామాలను 3 కట్టడి ప్రాంతాలుగా గుర్తించారు. అయితే గ్రామాల్లో పకడ్బందీగానే లాక్‌డౌన్ అమలవుతున్నా జిల్లా కేంద్రంలోనే కట్టడి ప్రాంతాలపై అధికారుల నిఘా కొరవడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా ప్రత్యేకాధి కారులనునియమించి నిత్యం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ కొందరు అధికారులు సొంత శాఖ పనుల్లోనే నిమగ్నమై కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను విస్మరిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రధాన కూడళ్ల వద్దనే పోలీసుల నిఘా కనిపిస్తున్నా పూర్తి స్థాయిలో కట్టడి ప్రాంతాలపై నిఘా కొరవడు తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు స్థానిక రాజకీయ నేతలు చేస్తున్న సిఫార్సులతో లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తేనే కరోనా వైరస్ కట్టడికి అవకాశం ఉంటుంది.
పూర్తి స్థాయి లాక్‌డౌనే ఉత్తమం..
జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను విధించడమే ఉత్తమమైన మార్గంగా కనిపిస్తోంది. కేసుల సంఖ్య మరింత పెరిగితే అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదంటు న్నారు. పక్కనే ఉన్న నిర్మల్ జిల్లాలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించడంతో మంచి ఫలితాలు వస్తు న్నట్లు సమాచారం. గత వారం రోజులుగా అక్కడ కొత్త కేసులు నమోదు కావడం లేదంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం కూరగాయలు, నిత్యావసర సరుకుల అవసరాలకు ఇస్తున్న వెసులుబాటును తక్షణమే ఎత్తివేయాలనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి.
ఇదివరకు ఉన్న ఆరెంజ్ జోన్ పరిస్థితులను దాటిపోయిన జిల్లాలో రెడ్‌జోన్‌లో అమలు చేసే నిబంధనలు వెంటనే అమల్లోకి తేవాలని కోరుతున్నారు. మరింత కఠినమైన నిబంధనలు అమలు చేస్తేనే పరిస్థితి అదుపులోకి వస్తుంది. అలాగే నిత్యం సాధ్యమైనంత వరకు పరీక్షల సంఖ్యను పెంచితే ప్రయోజనం ఉంటుం దని పేర్కొంటున్నారు. ఇంటింటికి చేపడుతున్న సర్వేలో మరింత పకడ్బందీగా చేపట్టి అనుమానిత వ్యక్తులను త్వరగా గుర్తిస్తేనే వైరస్ తీవ్రతను అరికట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.