ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోను ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2020-10-04T09:52:46+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు డిమాండ్‌ చేశారు

ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోను ఉపసంహరించుకోవాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు


ఏసీసీ, అక్టోబరు 3: రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపు మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నాయకులు, కార్యకర్తలు శనివారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వెరబెల్లి రఘునాథ్‌రావు మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని అన్నారు. అసలే ప్రజలు కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో పేద ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. రిజిస్ట్రేషన్‌ చేసిన భూములను మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయాలని అనడం ప్రజలను దోపిడీకి గురిచేయడమే  అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాడుతుందని తెలిపారు.  అప్పు చేసి  ప్లాట్లు కొనుగోలు చేసిన పేదలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.


రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇబ్బందులు కలుగకుండా దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గోనె శ్యాంసుందర్‌రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు గోపతి మల్లేష్‌, అందుగుల శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ఎనగందుల కృష్ణమూర్తి, జీవి ఆనంద్‌ కృష్ణ, ఆరుముల్ల పోషం, మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, జిల్లా కార్యదర్శులు సప్పిడి నరేష్‌, కోయల్కర్‌ గోవర్థన్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జోగుల శ్రీదేవి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్‌, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మాధవరపు రమణరావు, జిల్లా అధికార ప్రతినిధి తులా మధుసూదన్‌రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి బోయిని, రంగ శ్రీశైలం, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


టీడీపీ ఆధ్వర్యంలో..

బెల్లంపల్లి టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం  ఎల్‌ఆర్‌ఎస్‌  జీవోను వెంటనే రద్దు చేయాలని టీడీపీ నాయకులు బెల్లంపల్లి సబ్‌ కలెకర్‌ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు మనిరాంసింగ్‌,  జిల్లా  కార్యదర్శి రాజ్‌కుమార్‌ పాండే మాట్లాడారు. పేద ప్రజలను దోచుకునేందుకే రాష్ట్ర ప్రభత్వం ఈ జీవో తీసుకొచ్చిందని విమర్శించారు.   దీన్ని వెంటనే విరమించుకోవాని కోరారు.  అనంతరం ఆర్డీవో శ్యామలాదేవి కి  వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాద్యక్షుడు మద్దెల రాజనర్సు, ఎండీ గౌస్‌, ఎండీ హసన్‌, బి మల్లయ్య, ఎం అచ్చయ్య, సీహెచ్‌ ప్రకా ష్‌, గంగాధర్‌గౌడ్‌, ఎ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-04T09:52:46+05:30 IST