భూముల నమోదు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
ABN , First Publish Date - 2020-10-19T10:14:15+05:30 IST
ధరణి పోర్టల్‌లో భూముల నమోదు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టాలి కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. ఆదివార మంచిర్యాల, హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయాలలో ధరణి పోర్టల్ ప్రక్రి యను కలెక్టర్ పరిశీలించారు.

కలెక్టర్ భారతి హోళికేరి
హాజీపూర్, అక్టోబరు 18: ధరణి పోర్టల్‌లో భూముల నమోదు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా చేపట్టాలి కలెక్టర్ భారతి హోళికేరి సూచించారు. ఆదివార మంచిర్యాల, హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయాలలో ధరణి పోర్టల్ ప్రక్రి యను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన దసరా పండగ సందర్భంగా ధరణి పోర్టల్ ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించిన మేరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అన్నారు. భూముల అమ్మకాలు, కొనుగోలు, మ్యుటేషన్ కోసం ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికి నిర్ణీత తేదీ, సమయం కేటాయిస్తూ స్లాట్ బుకింగ్ జరుగుతుందని చెప్పారు. ఈ వివరాలు లబ్ధిదారులకు తెలియజేయాలని తెలిపారు.
జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు ధరణి పోర్టల్ ద్వారా ప్రయోగాత్మకంగా ప్రతీ రోజు కనీసం 10 లావాదేవీలు చేపట్టాలని చెప్పారు. ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మంచిర్యాల, హాజీపూర్ మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.